Natural Mosquito Repellent Plants: దోమలను తరిమే మొక్కలు.
వర్షాకాలం మొదలవగానే దోమల దండయాత్ర కూడా మొదలైపోతుంది. దీంతో అనేక రోగాల బారిన పడతాం. ఇలా కాకుండా ఉండాలంటే వాటిని కట్టడి చేయక తప్పదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇంట్లోకి వచ్చేస్తుంటే.. ఇంట్లోనే వాటిని తరిమే మొక్కలను పెంచండి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తులసి (Tulasi):
సాధారణంగా ప్రతి ఇంట్లోనూ ఈ మొక్క కనిపిస్తుంది. ఎన్నో రకాల ఔషధాల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. దోమలతోపాటుగా పురుగులనూ ఇది తరిమికొడుతుంది.
లావెండర్ (Lavender):
సువాసనలను వెదజల్లే ఈ మొక్క కీటకాలనూ దరిచేరనివ్వదు. దోమలు, ఈగలు, ఇతర కీటకాలను దూరంగా తరిమేస్తుంది.
లెమన్ గ్రాస్ (Lemon Grass):
ఈ గడ్డి నుంచి వెలువడే నిమ్మ సువాసనలు దోమలను దూరంగా ఉంచుతాయి.
అగిరేటమ్ (Aregatum):
దీన్నే గోబ్బీడ్, జంగిల్ పుదీనా అనికూడా అంటారు. దీనికి వంగపండు రంగు పూలు కూడా పూస్తాయి.
దీన్నుంచి వచ్చే నూనెను దోమల నివారణ మందుల్లో ఉపయోగిస్తారు.
Natural Mosquito Repellent Plants
క్యాట్నిప్(Catnip):
దీన్నే క్యాట్మెంట్ అనికూడా అంటారు. దీన్నుంచి వచ్చే నూనెలను దోమల నివారణ మందులు, పెర్ఫ్యూమ్స్ నూ
వాడతారు.
లెమన్ బామ్ (Lemon Balm):
సిట్రస్ జాతి మొక్కల సువాసనను వెదజల్లే ఈ మొక్క వాసనా కీటకాలకి గిట్టదు. పుదీనా కుటుంబానికి చెందిన ఈ మొక్క కుండీల్లో త్వరగా, ఏపుగా పెరుగుతుంది.
రోజ్మేరీ (Rosemary):
ఈ మొక్క నుంచి విడుదలయ్యే రసాయనాలు దోమలను దూరంగా తరిమేస్తాయి. దీన్ని చిన్న తొట్టెలో సులువుగా పెంచుకోవచ్చు.
For More : Click Here