Psychology Online Practice Test 01 TET DSC : In this Post we are Providing Psychology Online mock Test, Practice Test for the Candidates Appearing for TET and DSC in Telangana TG or Andhra Pradesh AP

[WpProQuiz 5]

[WpProQuiz_toplist 5]

Psychology Online Practice Test 01 is very Useful and is a practice Test

మనో విజ్ఞాన సాంప్రదాయాలు

  1. సంరచనాత్మక వాదం :

– ఈ వాద మూలపురుషుడు ఊంట్ (జర్మనీ)

– ఈ వాదం ప్రకారం మనోవిజ్ఞాన శాస్త్రం చేతనత్వాన్ని అధ్యయనం చేస్తుంది.

-ఈ వాదం ప్రకారం మనస్సులోని అంశాలు- సంవేదనలు, ప్రతిమలు, అనుభూతులు

– ఈ వాదం యొక్క లక్ష్యం – మనసులోని అంశాలను విశ్లేషించడం

– మనస్సు నిర్మాణం, మనస్సు అంటే ఏమిటి ? ఏ విధంగా ఉంది ? అనే విషయాలను తెలియజేస్తుంది.

– కంజెంట్ సైకాలజీ అందురు.

  1. కార్యకరణ వాదం!

– ఈ వాద మూలపురుషుడు విలియం జేమ్స్ (అమెరికా)

– Principles of Psychology గ్రంధ రచయిత

– మనస్సు చేసే పనులు గురించి తెలుపుతుంది.

– పరిసరాలతో సర్దుబాటు చేసుకొనే కారకాలైన అవధానం, ప్రత్యక్షం, ప్రజ్ఞలను గురించి తెలుపుతుంది.

  1. ప్రవర్తనా వాదం

-ఈ వాద మూలపురుషుడు జే.బి.వాట్సన్ (అమెరికా)

– ఇది జంతువుల మీద పరిశోధనలు చేయడానికి తోడ్పడుతుంది.

-పావ్లోవ్, డైక్, స్కిన్నర్ ప్రయోగాలు ఈ వాదాన్ని సమర్ధిస్తున్నాయి.

– Behavior : An Introduction to comparative Psychology  గ్రంధ రచయిత- వాట్సన్

  1. మనోవిశ్లేషణా వాదం :

– ఈవాద మూలపురుషుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ (ఆస్ట్రియా)

– వ్యక్తులు యొక్క చింతనలు, అనుభూతులు, కలలు, పగటి కలలు విశ్లేషణ ద్వారా అర్ధం చేసుకోవచ్చు అనేది ఈ వాదం.

– పైకి చెప్పలేని, సమాజం ఆమోదించని భావాలు, ఆలోచనలు, కోరికలు, భయాలు అచేతనత్వంలో వుంటాయి. – వ్యక్తుల నాడీరుగ్మతలు, స్వప్నాలు, నోరు జారడం ద్వారా అచేతన ప్రక్రియను బహిర్గత పరుస్తారు.

– అచేతన ప్రేరణ సిద్ధాంతంను ప్రతిపాదించెను.

– మూర్తిమత్వాన్ని వివరించడం దీనియొక్క ముఖ్య ఉద్దేశ్యం.

– “ఇంటర్ ప్రిటేషన్ ఆఫ్ డ్రిమ్స్” గ్రంథరచయిత – ఫ్రాయిడ్

  1. గెస్టాల్ట్ వాదం :

– ఈవాద మూలపురుషులు- వర్ణిమర్, కోఫ్కా, కొహిలర్ (జర్మనీ)

– సంరచనాత్మక, కార్యకరణ, ప్రవర్తనా వాదాలకు వ్యతిరేకంగా ఉద్భవించింది. -గెస్టాల్ట్ అనే జర్మన్ పదానికి అర్ధం – సమగ్ర ఆకృతి

– మనస్సును, సంవేదనలు, ప్రతిమలు, అనుభూతులుగా విడగొట్టడాన్ని విమర్శించింది. – భాగాలన్నింటిని మొత్తంగా పరిశీలించినపుడే అర్ధవంతంగా ఉంటుంది.

-వీరు అంతర్ దృష్టి అభ్యసనం పై ప్రయోగాలు చేసారు.

-గెస్టాల్ట్ సంప్రదాయాన్ని అనుసరించి మూర్తిమత్వ సిద్ధాంతాన్ని వివరించినది లెవిన్ – క్షేత్ర సిద్ధాంతాన్ని రూపొందించినది – లెవిన్

Also Attempt More Psychology Online Practice Tests

  1. ప్రయోజనతా వాదం :

ఈ వాద మూలపురుషుడు – విలియం మెక్ డోగల్ (బ్రిటన్) – దీనినే హర్మిక్ సిద్ధాంతం అని కూడా అంటారు. అంతఃప్రేరణ వ్యక్తిని గమ్యచర్య శీలత వైపు నడిపిస్తుంది. -సహజాత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది- విలియం మెక్ డోగల్

  1. వైయక్తిక మనోవిజ్ఞాన శాస్త్రం అడ్లర్
  2. విశ్లేషణాత్మక మనో విజ్ఞాన శాస్త్రం – యాంగ్
  3. సంజ్ఞానాత్మక వాదం- పియాజె
  4. సంసర్గవాదం జాన్ లాక్
  5. మానవతా వాదం అబ్రహం మాస్లో
Follow us on- Facebook | YouTube | Telegram Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *