Todays Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు 21 August 2024
Today Horoscope: August 21 రాశి ఫలాలు-ఈ రాశి వారికి ఆటంకాలు వస్తాయి…మీ రాశి ఉందా… ప్రతి రోజు జాతకాలను చూసుకుంటూ అడుగులు వేసే వారు చాలా మంది ఉన్నారు. మనలో చాలా మంది జాతకాలను నమ్ముతూ ప్రతి రోజు రాశి ఫలాలను తెలుసుకొని వాటికీ అనుగుణంగా అడుగులు వేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ రాశి ఫలాలు.
మేషరాశి
ఈ రాశి వారు చేసే పనిలో మనో బలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల మద్దతు అవసరం. కొన్ని సంఘటనలు కొంత బాధను కలిగిస్తాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. చేసే పనిలో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
వృషభ రాశి
ఈ రాశి వారు ఆత్మ శుద్ధితో పనిచేస్తే విజయాలను అందుకుంటారు. తరచూ నిర్ణయాలను మార్చుకోవటం వలన ఇబ్బందులు వస్తాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆలోచనలు చేయాలి.
మిధున రాశి
ఈ రాశి వారు కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకొనే సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. చేసే ప్రతి పనిని పట్టుదలతో చేస్తారు. డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది.
కర్కాటక రాశి
ఈ రాశి వారికి చేసే పనిలో శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే విజయాలను మాత్రం సొంతం చేసుకుంటారు. వివాదాల జోలికి అస్సలు వెళ్ళకూడదు.పనులలో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి.
సింహరాశి
ఈ రాశి వారికి అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఏ పని చేసిన మనోధైర్యంతో ముందడుగు వేస్తే మంచి ఫలితాలు వస్తాయి. తోటి వారి సహకారంతో మేలు జరుగుతుంది.
కన్యా రాశి
ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఆత్మీయుల సలహాలు ప్రశాంతతను కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ వాదనలకు వెళ్ళకూడదు.
తులారాశి
ఏ పని చేసిన బాగా ఆలోచించి చేయాలి. చేసే పనిలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. వాటిని జాగ్రత్తగా అధికమించాలి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు.
Todays Horoscope in Telugu 21 august 2024
ధనస్సు రాశి
ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్యమైన వ్యవహారంలో మంచి మద్దతు లభిస్తుంది. దాంతో వారు అనుకున్న పనులు అనుకున్న విధంగా చేస్తారు. ఒక శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
మకర రాశి
ఈ రాశి వారు ఉత్సాహంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. మనో బలం తగ్గకుండా చూసుకోవాలి.
కుంభరాశి
ఈ రాశి వారికి శ్రమకి తగ్గ ఫలితం ఉంటుంది. కలహాలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు లేకుండా చూసుకోవాలి.
మీన రాశి
ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం బాగా పెరుగుతుంది. వివాదాల జోలికి అసలు వెళ్ళకూడదు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
For More : Click Here