TELANGANA DSC Exam 2024 Schedule : రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయ నియామాకాల కోసం నిర్వహించే డీఎస్సీ పరీక్ష షెడ్యూల్​ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీఆర్‌టీ విధానంలో రోజుకు రెండు షిఫ్ట్‌లలో డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి.

TELANGANA DSC Exam 2024 Schedule : ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. రాష్ట్రప్రభుత్వం డీఎస్సీ పరీక్ష షెడ్యూల్​ను విడుదల చేసింది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీఆర్‌టీ విధానంలో రోజుకు రెండు షిఫ్ట్‌లలో డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూల్ కింది విధంగా ఉంది.

Click here to Download TELANGANA DSC Exam 2024 Schedule

2.79 లక్షల దరఖాస్తులు : రాష్ట్రంలో మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి, ఫిబ్రవరి 28న పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. పరీక్షలకు దరఖాస్తుల గడువు ఈ నెల 20వ తేదీతో ముగిసింది. మొత్తం 2.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అభ్యర్థులపరంగా చూస్తే, సుమారు 2 లక్షల వరకు ఉంటారని తెలుస్తోంది. అంటే ఒక్కో పోస్టుకు సుమారు 25 మంది పోటీ పడుతున్నారు. డీఈడీ, బీఈడీ పూర్తి చేసి టెట్​ ఉత్తీర్ణులైన వారు సెకండరీ గ్రేడ్​ టీచర్ ​(ఎస్జీటీ), స్కూల్​ అసిస్టెంట్​ (ఎస్​ఏ) రెండు పోస్టులకు దరఖాస్తు చేస్తారు.

అలాగే బీఈడీ పూర్తి చేసి టెట్​ పాసైన వారు ఎస్​ఏలోనే రెండు సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.అత్యధికంగా హైదరాబాద్​ జిల్లా నుంచి 27,027 ఆ తర్వాత నల్గొండ నుంచి 15,610 దరఖాస్తులు వచ్చాయి. నాన్​లోకల్​ కోటా(ఐదు శాతం) కింద ఇతర జిల్లాల వారు సైతం హైదరాబాద్​లో పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అక్కడ అధికంగా దరఖాస్తులు అందాయని భావిస్తున్నారు.

Follow us on- Facebook | YouTube | Telegram Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *