MJPTBCW Backlog Admissions 2024-25: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల నిర్వహణ కొరకు ప్రభుత్వం మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థను స్థాపించడమైనది. ప్రస్తుతం ఈ సంస్థ ఆధ్వర్యంలో 294 గురుకుల పాఠశాలలున్నవి. అందులో 148 బాలురు, 146 బాలికల పాఠశాలలు కలవు. అన్ని విద్యా సంస్థల్లో అత్యున్నత ఫలితాలను సాధిస్తూ తెలంగాణలోనే అగ్రగామి సంస్థగా నిలుస్తున్నది. 2022-23 సంవత్సరం 10వ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణత శాతం: 97.53% సాధించి, రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచింది.
ఎవరు అర్హులు :
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఎంబీసీ విద్యార్థులు, అనాథలు అర్హులు.
- ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అర్హులు
- వరుసగా 2022-23 మరియు 2023-24 విద్యా సంవత్సరాల్లో నమోదు అయి ఉండాలి. అంటే ఈ రెండేళ్లలో డ్రాప్ అవుట్ అయిన వారు అప్లై చేయడానికి అనర్హులు.
MJPTBCW Backlog Admissions 2024-25 |
||
6వ తరగతి | 6వ తరగతిలో చేరాలనుకునే విద్యార్థులు 2023-24లో 5వ తరగతి చదువుతూ ఉండాలి. | 12 ఏళ్లు (ఆగస్టు 31, 2024 నాటికి) మించకూడదు. SC-STలకు 2 సంవత్సరాలు మినహాయింపు. |
7వ తరగతి | 7వ తరగతిలో చేరాలనుకునే విద్యార్థులు 2023-24లో 6వ తరగతి చదువుతూ ఉండాలి. | 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు (ఆగస్టు 31, 2024 నాటికి). SC-STలకు 2 సంవత్సరాల మినహాయింపు. |
8వ తరగతి | 8వ తరగతిలో చేరాలనుకునే విద్యార్థులు 2023-24లో 7వ తరగతి చదువుతూ ఉండాలి. | ఆగస్టు 31, 2024 నాటికి 14 ఏళ్లు మించకూడదు. SC-ST లకు 2 సంవత్సరాల మినహాయింపు. |
MJPTBCW Backlog Admissions 2024-25
ఆదాయ పరిమితి:-
తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం కింది విధంగా ఉండాలి.
గ్రామీణ ప్రాంతం వారికి 1,50,000 RS/-
పట్టణ ప్రాంతం వారికి 2,00,000 RS/-
ప్రవేశ పరీక్ష తేదీ:-
03-03-2024 రోజున ఉదయం 10:౦౦ గంటల నుండి మధ్యాహ్నం 12:౦౦ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాత జిల్లా కేంద్రాలలో పరీక్ష నిర్వహించబడును.
పరీక్ష విధానం:-
- పరీక్ష ప్రశ్నా పత్రం ఆబ్జెక్టివ్ పద్ధతిలో తెలుగు మరియు ఇంగ్లీష్ లో ఉంటుంది ( OMR విధానం ).
- 2 గంటల సమయం ఉంటుంది.
పరీక్ష సిలబస్ :
- ఇప్పుడు చదువుతున్న తరగతుల్లోని అంశాలను మాత్రమే తీసుకుంటారు.
MJPTBCW Backlog Admissions 2024-25 |
|
మొత్తం మార్కులు | 100 |
తెలుగు | 15 మార్కులు |
గణితం | 30 మార్కులు |
సామాన్య శాస్త్రం | 15 మార్కులు |
సాంఘీక శాస్త్రం | 15 మార్కులు |
ఇంగ్లీష్ | 25 మార్కులు |
దరఖాస్తుకు ప్రారంభ తేదీ:- 08-01-2024
దరఖాస్తుకు ముగింపు తేదీ:- 15-02-2024
Click Here to Apply: Application Link