Indiramma Indlu Housing App : ఇందిరమ్మ ఇండ్ల యాప్‌ (ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌) ను హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లు ఆవిష్కరించారు. ఈ యాప్ శుక్రవారం నుంచి అందుబాటులోకి రానుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఒక్కో గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి పరీక్షించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి మండలం గ్రామంతోపాటు మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఈ యాప్‌తో సర్వే నిర్వహించారు. యాప్ పనితీరు మెరుగ్గా ఉన్నందున, ఇది దేశవ్యాప్తంగా విస్తరించబడుతోంది. అప్లికేషన్‌కు 39 ఉత్పత్తులు జోడించబడ్డాయి. దీని ఆధారంగా, దరఖాస్తుదారుల డేటాను సేకరిస్తారు. ధృవీకరణ తర్వాత, రూ. 5 లక్షల మొత్తం నాలుగు ఇన్‌స్టాలేషన్‌లలో చెల్లించబడుతుంది.

యాప్‌లో అడిగే వివరాలు..
యాప్‌లో దరఖాస్తుదారు పేరు, ఆధార్‌కార్డు నంబర్‌, సొంత స్థలం ఉందా?

బలహీనవర్గాలకు చెందినవారా?తదితర 39 రకాల వివరాలను దరఖాస్తుదారుల ఇండ్లకు వెళ్లి అధికారులు ఆ వివరాలను యాప్‌లో నమోదు చేస్తారు. వాటి ఆధారంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి దరఖాస్తుదారులు అర్హులా? కాదా? అనేది నిర్ధారణ అవుతుంది. దరఖాస్తుదారులు ఆధార్‌కార్డు, మొబైల్‌నంబర్‌, ఎలక్ట్రిసిటీ బిల్లు, అడ్రస్‌ ప్రూఫ్‌, పాన్‌కార్డు, రేషన్‌కార్డు, స్థలానికి సంబంధించిన ఫొటో, జియోకార్డినేట్స్‌ తదితర ధ్రువీకరణల ఫొటో/ డాక్యు మెంట్లను యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

Indiramma Indlu Housing App సర్వే అధికారుల విచారణలో..
సర్వే అధికారుల విచారణలో మూడు, నాలుగు చక్రాల వాహనాలు, ట్రాక్టర్‌ వంటి వ్యవసాయ పరికరాలు, కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగా? ఆస్తిపన్ను చెల్లిస్తున్నారా? కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ పథకం ద్వారా ఇల్లు మంజూరైందా? పరిశీలిస్తారు. ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా సర్వే ఒకనెలలో పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలివిడత రేషన్‌కార్డు లేకున్నా ఆదాయ సర్టిఫికెట్‌ ఆధారంగా వర్తింపజేస్తారు.

ఎంపిక విధానం..
సర్వే గెజిటెడ్‌స్థాయి ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో గ్రామ/వార్డు ఆఫీసర్ల ద్వారా జరుగుతుంది. ఇండ్ల మంజూరులో భూమిలేని వ్యవసాయ కార్మికులు, వికలాంగులు, ట్రాన్స్‌జెండర్లు, కనీసం గుడిసె కూడా లేనివారికి ప్రాధాన్యం ఇస్తారు. డాక్యుమెంట్‌ ప్రూప్‌ ఉన్నవారికి మొదటి ప్రాధాన్యం, డాక్యుమెంట్‌ ప్రూప్‌లేని పక్షంలో కరెంట్‌బిల్లు, సంబంధిత అగ్రిమెంట్లనూ సమర్పించాల్సి ఉంటుంది. ఇండ్లను మహిళల పేరుతో మంజూరు చేస్తారు. ఇంటి నిర్మాణం గదులు, వంటగది, మరుగుదొడ్డి కలిగి కనీసం 400 చదరపు అడుగుల్లో స్లాబ్‌ ఏరియా ఉండాలి. దీనికి ఎలాంటి డిజైన్‌నూ ప్రభుత్వం సూచించటం లేదు. లబ్దిదారులు ఆర్‌సీసీ స్లాబ్‌తో ఇల్లు నిర్మించుకోవచ్చు.

యాప్‌తో రాజకీయ జోక్యం ఉండదంటున్న ప్రభుత్వం
ఇందిరమ్మ ఇండ్ల యాప్‌తో రాజకీయ జోక్యం ఉండదని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను ఎంపిక చేశారు. దీనిలో పంచాయతీ సెక్రటరీ, అంగన్‌వాడీ టీచర్‌, ఆశా వర్కర్‌తో పాటు సామాజిక సేవ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనేవారిని కమిటీల్లో ఎంపిక చేశారు. అయితే ఈ యాప్‌లో పొందుపరిచిన నిబంధనలు పాటిస్తే మాత్రం రాజకీయ జోక్యం ఉండకపోవచ్చు. కానీ వీటిని ఎంత వరకు పరిగణలోకి తీసుకుంటారనేది అనుమానంగానే ఉంది. ఇప్పటికే పలుచోట్ల ఈ కమిటీల ఎంపికపై వివాదాలు నడుస్తున్నాయి. ఎంపిక ప్రక్రియపై అనుమానాలు నెలకొన్నాయి. నిబంధనల్లో మూడు, నాలుగు చక్రాల వాహనాలు ఉంటే అనర్హులుగా పేర్కొనడంతో ఆటో డ్రైవర్లు, కారు ట్యాక్సీ డ్రైవర్ల వంటి వారిలో ఆందోళన నెలకొంది. అయితే ఆదాయాన్ని బట్టే ఎంపిక ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నెలకు రూ.500కు మించి విద్యుత్‌బిల్లు వచ్చేవారిని అనర్హులుగా ప్రకటిస్తారని చెబుతున్నారు.

Indiramma Indlu housing scheme

నిధుల విడుదల..
లబ్దిదారుల ఎంపిక అనంతరం మొత్తం నాలుగు విడతలుగా రూ.5 లక్షలను విడుదల చేస్తారు. బేస్‌మెట్‌ లెవల్లో రూ.లక్ష, స్లాబ్‌ లెవల్‌కు చేరుకున్నాక రూ.లక్ష, స్లాబ్‌ వేసేందుకు రూ.2లక్షలు, ప్లాస్టింగ్‌, ఇతరత్రా అన్ని పనులూ పూర్తయ్యాక మరో రూ.లక్ష విడుదల చేస్తారు. లబ్దిదారునికి నచ్చిన రీతిలో ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పెట్టదు.

పారదర్శకత కోసమే యాప్‌ : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పారదర్శకత కోసమే ఈ యాప్‌ను ప్రవేశపెట్టాం. ఎంపికలో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా ఇది ఉపయోగపడుతుంది. లబ్దిదారుల ఎంపికలో గతంలో లాగా ఎలాంటి అవకతవకలకూ తావుండదు. పకడ్బందీగా ఉండటం కోసమే ఈ మొబైల్‌ యాప్‌ను ప్రవేశపెట్టాం. ఎంపిక కోసం ఎవరూ ఏ ఒక్కరికీ పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. నిబంధనల ప్రకారమే ఎంపిక ఉంటుంది.

Click here to download Indiramma Indlu Scheme Housing App

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *