AP TET 2024 : TET పరీక్షకు సంబంధించి ముఖ్యమైన అప్‌డేట్ వచింది. డీఎస్సీ కంటే ముందే టెట్ పరీక్ష నిర్వహించాలని AP విద్యాశాఖ యోచిస్తోంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని.. రెండు మూడు రోజుల్లో టెట్ నోటీసు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.
2022లో టెట్ పరీక్షను నిర్వహించింది. 2022, 2023లో డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వారు కూడా ఉన్నారు.దీంతో పాటు గతంలో అనర్హులు కూడా టెట్ రాసేందుకు అవకాశం కల్పించాలన్నారు. టెట్ నిర్వహిస్తే 500,000 మందికి పైగా పరీక్షా రాస్తారని ఒక అంచనా.
మరోవైపు టెట్ రాసే అభ్యర్థుల విద్యార్హతలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోని నిబంధనలను సవరిస్తూ ఉత్తర్వులను ప్రభుత్వం జారి చేసింది.
- సెకండరీ గ్రేడ్ టీచర్ల కోసం నిర్వహించే టెట్-1 పరీక్షకు హాజరయ్యేందుకు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ), నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఎల్ఈడీ) పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులని పేర్కొంది.
- పేపర్ 1 రాసే అభ్యర్థులు ఇంటర్మీడియట్ స్థాయిలో 50% మార్కులు సాధించాలి.
- టెట్ పేపర్-2 రాయాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగుల్లో 50% ఫైనల్ మార్కులు తప్పనిసరి అనే నిభందానని సవరిస్తూ 40 శాతానికి తగ్గించారు. ఈ నిర్ణయాలు తదుపరి టెట్ నోటీసుకు వర్తిస్తాయి.
ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసిన వారు అనర్హులు:
బీఈడీ చేసిన వారికి ఎస్జీటీ పోస్టులకు అవకాశం లేదని తాజా ఉత్తర్వుల ద్వారా స్పష్టమవుతున్నది.
Click Here to Download
AP TET 2024 Paper-II ఉత్తర్వులు :
గ్రాడ్యుయేషన్‌లో 40% మార్కులతో B.Ed కోర్సులో పూర్తీ చేసిన SC/ST/BC మరియు PH అభ్యర్థులకు APTET-2024లో పేపర్-II కి హాజరయ్యేందుకు డిగ్రిలో కనీస అర్హత మార్కులను 40% గా పరిగణించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
APTET 2024 Qualifying Marks 40% for SC/ST/BC/PH to appear for AP TET Paper -II Memo 1331600