Akkineni Nagarjuna N Convention: శోభిత అడుగుపెట్టిన వేళ విశేషం..నాగార్జున‌కు బిగ్ షాక్

టాలీవుడ్ హీరో నాగార్జునకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. మాదాపూర్‌లోని తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్‌కన్వెన్షన్‌ హాల్‌ను నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణంపైనా ఫిర్యాదుల వచ్చాయి. ఎన్ కన్వెన్షన్ ను తాకుతూనే చెరువు నీళ్లు ఉంటాయి. దీంతో, ఈ నిర్మాణం కు సంబంధించి హైడ్రా పూర్తి వివరాలు సేకరించింది. ఈ రోజు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు ప్రారంభించింది. తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని హైడ్రా గుర్తించింది.

అయితే, నాగార్జునకు చెందిన నిర్మాణం కావటంతో అధికారులు కూల్చివేత వంటి సీరియస్ నిర్ణయాలు తీసుకుంటారా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఎవ్వరినీ వదిలిపెట్టేది హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథన్ స్పష్టం చేశారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ కూల్చివేయడంపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా సమంత అభిమానులు అయితే ఓ రేంజ్‌లో రియాక్ట్ అవుతున్నారు. శోభిత ధూళిపాళ అక్కినేని ఫ్యామిలీలో అడుగుపెట్టిన వేళ విశేషం, నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేశారని సమంత అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది సమంతకు జరిగిన అన్యాయం ఊరికే పోతుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సమంతతో విడాకులు అనంతరం నాగ చైతన్య శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో మెయిన్‌టైన్ చేశారు. నాగ చైతన్య శోభితతో ఉన్న బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకున్నాడు.ఈక్రమంలోనే సైలెంట్‌తో శోభితతో ఆగస్టు 8న నిశ్చితార్ధం చేసుకున్నాడు. అతి కొద్దిమంది సమక్షంలో వీరి నిశ్చితార్ధ కార్యక్రమం జరిగింది. నాగ చైతన్య రెండో పెళ్లిపై సమంత మౌనం వహించారు. కానీ ఆమె అభిమానులు మాత్రం నాగ చైతన్యపై ఫైర్ అవుతూనే ఉన్నారు. నాగ చైత్య , శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థంపై సమంత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైవాహిక జీవితంలో సమంత కరెక్ట్‌గానే ఉందని, నాగ చైతన్య అలా ఉండలేకపోయాడని ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *